'నిన్నుకోరి’, ‘మజిలీ’ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు ఓ క్రేజీ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడట. అది మరెవరోకాదు హీరో విజయ్ దేవరకొండ. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. శివ నిర్వాణ తదుపరి చిత్రం దేవరకొండతోనే ఉండబోతుందట. ఇప్పటికే శివ.. విజయ్‌ను కలిశాడని, మంచి కథ సిద్ధం చేసుకొని వస్తే డిసెంబరు నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లొచ్చని దేవరకొండ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ! - sai dharam tej
టాలీవుడ్ యువదర్శకుడు శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ
ప్రస్తుతం దేవరకొండ ‘డియర్ కామ్రేడ్‌తో సందడి చేసేందుకు ముస్తాబవుతున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసి, శివతో మూవీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడట. మరి ఈ ప్రాజెక్టు మాటల్లోనే ఉంటుందా? లేక కార్యరూపం దాల్చుతుందా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
ఇవీ చూడండి.. 'కళంక్'లోని పాటకు మాధురి అదిరే స్టెప్పులు