"ఓ కథ థియేటర్లకు అనుకుంటే.. దానికి తగ్గట్లుగానే రాయాల్సి ఉంటుంది. ఓటీటీకి అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే మలచుకోవాల్సి ఉంటుంది. థియేటర్ కోసం రాసిన కథను ఓటీటీకి ఇవ్వడం కష్టంగానే ఉంటుంది" అన్నారు శివ నిర్వాణ (Shiva Nirvana tuck Jagadeesh movie). 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు 'టక్‌జగదీష్'తో(Nani Tuck Jagadeesh) ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రుచి చూపించనున్నారు. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో(Tuck Jagadeesh movie release date in amazon prime) విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శివ నిర్వాణ. అవి ఆయన మాటల్లోనే..
"మజిలీ' పూర్తయిన వెంటనే నానితో సినిమా చేయాలనుకున్నా. ఆఫీసుకెళ్లి కథ చెప్పడమే ఓ ట్విస్ట్‌తో చెప్పా. అది వినగానే ఆయనకి బాగా నచ్చి చేసేద్దామన్నారు. నిజానికి కథ వినడానికి వచ్చేటప్పుడు ఆయన (Nani Movies) నాకు 'నో' ఎలా చెప్పాలని అనుకున్నారట. ఎందుకంటే అంతకు ముందు నేను తీసినవన్నీ ప్రేమకథలే కావడంతో మళ్లీ అలాంటిది చెప్తాననుకున్నారు. నేను.. భూదేవిపురం, భూకక్షలు అని చెప్పగానే ఎగ్జైట్ అయ్యారు".
కథకు అదే స్ఫూర్తి..
"నేను చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలోనే పెరిగాను. తాతగారింట్లో బాబాయిలు, అత్తలు అలా అందరి మధ్య పెరిగాను. నేను చూసిన ఆ కుటుంబ భావోద్వేగాలన్నింటినీ ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. ఇన్ని ఫ్యామిలీ డ్రామా చిత్రాలు వచ్చాక ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఏవో కొన్ని కొత్త విషయాలు ఉండాలి కదా. అందుకే నేను చూసిన ఎమోషన్స్‌ను వాస్తవికంగా 'టక్ జగదీష్'(Tuck Jagadish release date)తో చూపించా."
ఇంట్లోనే సమస్య వస్తే..
"టక్ జగదీష్ సరదాగా ఉండే కుర్రాడు. బయటి నుంచి కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఇరగ్గొడతాడు. అదే ఇంట్లో వాళ్ల వల్లనే సమస్య వస్తే.. దాన్ని ఎలా పరిష్కరించాడనేది కథ. మలుపులు ఆకట్టుకుంటాయి. జగదీష్ నాయుడుగా నాని క్యారక్టరైజేషన్‌ను ప్రతిబింబించేలాగే టైటిల్ అలా ఫిక్స్ చేశాం. ఆయన టక్ వెనకాల ఓ సిన్సియర్ కారణం ఉంటుంది."