తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగనా రనౌత్​పై పరువు నష్టం దావా - బాలీవుడ్ నటి కంగన రనౌత్

విదేశీ క్రెడిట్​ కార్డులు తన దగ్గర ఉన్నాయంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్.. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కావాలనే తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Shiv Sena MLA files defamation suit against Kangana Ranaut
నటి కంగనపై పరువు నష్టం దావా వేసిన శివసేన ఎమ్మెల్యే

By

Published : Dec 14, 2020, 10:43 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కొన్ని మీడియా సంస్థలపై శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ పరువు నష్టం దావా వేశారు. ట్విట్టర్​లో ఆమె కామెంట్​ చేయడంపై, కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేసినందుకే ఈ పని చేసినట్లు పేర్కొన్నారు. ప్రతాప్ వద్ద పాకిస్థాన్​ క్రెడిట్​ కార్డులున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై మీడియా, కంగన గతంలో విమర్శలు చేశారు.

"నా పరువు తీయడానికే తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. నా దగ్గర పాకిస్థాన్​ క్రెడిట్​ కార్డు లాంటివేమీ లేవు. మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. అందుకే వారిపై పరువునష్టం కేసు వేస్తున్నాను"

-ప్రతాప్సర్నాయక్, శివసేన ఎమ్మెల్యే

పాకిస్థాన్​ క్రెడిట్ కార్డు ఆరోపణలపై స్పందించిన సర్నాయక్ 'ఈడీ సోదాలు నిర్వహించిపుడు ఎలాంటి క్రెడిట్​ కార్డు లభించలేదు' అని పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని కించపరిచేందుకే కంగన అసత్య ఆరోపణలు చేసిందని తెలిపారు. ఈడీ సోదాలు జరిపేందుకు తాను సహకరిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:'రామాయణ్' కోసం త్రివిక్రమ్.. నిజమేనా?

ABOUT THE AUTHOR

...view details