బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితమైన నటి శిల్పాశెట్టి. ఆమె షారుక్ ఖాన్ 'బాజిగర్' సినిమాతో 1993లో హిందీ ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. తెలుగులో 'సాహస వీరుడు సాగర కన్య', 'వీడెవడండీ బాబూ', 'ఆజాద్' తదితర చిత్రాల్లో సందడి చేశారు. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. కుమారుడు పుట్టిన తర్వాత అతడితోనే ఉండాలి అనిపించిందని, అందుకే సినిమాల్లో నటించలేదని శిల్పా ఓసారి చెప్పారు. ఇప్పుడు పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. టాలెంట్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా వ్యాపారవేత్త.
'సాగరకన్య' ఖరీదైన ఇల్లు చూశారా? - ShilpaShetty Rich house videos
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి.. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి జాలీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా పలు వీడియోలు అభిమానులతో పంచుకున్నారు. ఇందులో విలాసవంతమైన భవంతి.. అందులోని ఖరీదైన వస్తువులు శిల్పాశెట్టి అభిరుచికి అద్దంపట్టేలా ఉన్నాయి.
శిల్పాశెట్టి
అయితే లాక్‌డౌన్‌లో శిల్పా శెట్టి షేర్ చేసిన ఇంటి ఫొటోలు, వీడియోలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. క్వారంటైన్ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జూహూలోని ఇంట్లో ఉంటున్నారు. ఆమె విలాసవంతమైన భవంతి.. జిమ్, గార్డెన్, వంటగది వావ్ అనిపించాయి. ఇంట్లోని ఖరీదైన వస్తువులు శిల్పాశెట్టి అభిరుచికి అద్దంపట్టేలా ఉన్నాయి. ఎక్కువగా చేతితో చెక్కిన శిల్పాలు గదుల్లో కనిపించాయి. వాటిని మీరూ చూడండి..
ఇదీ చూడండి : అప్పుడేమో 'రింగ రింగ'.. ఇప్పుడేమో 'సీటీమార్'!