Shilpa Shirodkar Covid: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వదిన నటి శిల్పా శిరోద్కర్ కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న శిల్ప.. బుధవారం ఇన్‌స్టా వేదికగా కొవిడ్ బారినపడినట్లు పోస్ట్ చేశారు.
కొవిడ్ బారినపడి నాలుగు రోజులు అవుతున్నట్లు శిల్ప తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా. ప్రతి ఒక్కరు తప్పకుండా టీకా తీసుకోవాలి. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించండి. ప్రభుత్వం మీపట్ల జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది." అని ఫొటోకి కాప్షన్ జోడించారు.
ఈ పోస్ట్‌పై తన సోదరి, నటి నమ్రత శిరోద్కర్ కామెంట్ చేశారు. 'త్వరగా కోలుకో' అని అన్నారు. సంగీత బిలానీ కూడా శిల్ప త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు కామెంట్ చేశారు.