బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ 'అంధాదున్' తెలుగు రీమేక్‌లో యువ కథానాయకుడు నితిన్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. మాతృకలో సీనియర్ నటి టబు నటించి మెప్పించింది. అయితే తెలుగులో ఆ పాత్రలో మళ్లీ నటించడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని చిత్రబృందం సంప్రదించిందని సమాచారం.
'అంధాదున్' తెలుగు రీమేక్‌లో శిల్పాశెట్టి! - అంధాదున్ తెలుగు రీమేక్‌లో శిల్పాశెట్టి
'అంధాదున్' తెలుగు రీమేక్‌లో టబు పాత్ర కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని చిత్రబృందం సంప్రదించిందట. అయితే ఈ పాత్రలో నటించడానికి ఆమె ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. ఈ నేపథ్యంలో రీమేక్ చిత్రంలో శిల్పాశెట్టి మెరవడం లాంఛనమేనని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
'అంధాదున్' తెలుగు రీమేక్‌లో శిల్పాశెట్టి!
అయితే ఈ చిత్రంలో నటించడానికి శిల్ప ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ, అనసూయ పేర్లను పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. శిల్పాశెట్టి ప్రస్తుతం 'హంగామా2' చిత్రంలో పరేష్ రావల్‌తో కలిసి నటిస్తోంది.
ఇదీ చూడండి... శిల్పాశెట్టి: అమ్మగా ఫుల్‌టైమ్.. ప్రొఫెషనల్‌గా పార్ట్‌టైమ్
Last Updated : Jun 10, 2020, 6:32 AM IST