తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చీటింగ్​ కేసుపై స్పందించిన నటి శిల్పాశెట్టి - rajkundra latest news

తనపై నమోదైన చీటింగ్​ కేసుపై స్పందించిన బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి(Shilpa shetty updates).. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

shilpa
శిల్పాశెట్టి

By

Published : Nov 15, 2021, 10:21 AM IST

తనతో సహా తన భర్త రాజ్​కుంద్రాపై నమోదైన చీటింగ్​ కేసుపై స్పందించారు బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి(shilpa shetty updates). తాము ఎలాంటి మోసానికి పాల్పడలేదని అన్నారు. ఈ వార్త వినగానే తాను షాక్​కు గురైనట్లు చెప్పారు.

"కుంద్రా, నా మీద ఎఫ్​ఐఆర్​ రిజిస్టర్​ అయిందని తెలియగానే షాక్​ అయ్యాను. ఎస్​ఎఫ్​ఎల్​ ఫిట్​నెస్​ కంపెనీ బాధ్యతల్ని కాషిఫ్ చూసుకుంటున్నాడు. ఈ సంస్థకు చెందిన అన్ని డీల్స్​ అతడి వల్లే ఆగిపోయాయి. ఎలాంటి లావాదేవీలు గురించి మాకు తెలీదు. మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. గత 28ఏళ్లుగా నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. నా పేరును చెడగొడుతుంటే చాలా బాధేస్తుంది. చట్టాన్ని గౌరవించి జీవిస్తున్న భారత పౌరురాలిగా.. నా హక్కులను కాపాడండి."

-శిల్పాశెట్టి.

ఇదీ జరిగింది

శిల్పాశెట్టి దంపతులు తనని మోసం చేశారంటూ నవంబరు 14న ముంబయికి చెందిన వ్యాపారవేత్త నితిన్‌ పోలీసులను ఆశ్రయించాడు. తమ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ 2014లో ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఫిట్‌నెస్‌ కంపెనీ డైరెక్టర్‌ కాషిఫ్‌ ఖాన్‌, శిల్పా, రాజ్‌కుంద్రా కోరారని.. అలా చేస్తే పుణెలో ఎస్‌ఎఫ్‌ఎల్‌ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు తనకు అవకాశం ఇస్తామని వాళ్లు మాటిచ్చారని చెప్పాడు. దాంతో తాను రూ. 1.5 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు నితిన్‌ తెలిపాడు. అయితే, ఇన్ని సంవత్సరాలైనప్పటికీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ బ్రాంచ్‌లు కార్యరూపం దాల్చకపోవడం వల్ల విసిగిపోయిన తాను.. డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని కోరగా.. వాళ్లు తనని బెదిరిస్తున్నారంటూ అతడు బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నితిన్‌ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శిల్పాశెట్టి దంపతులతోపాటు ఎస్‌ఎఫ్‌ఎల్‌ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: శిల్పాశెట్టి, కుంద్రా దంపతులపై చీటింగ్​ కేసు

ABOUT THE AUTHOR

...view details