తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Shilpa Shetty: 'రాజ్‌కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలీదు' - raj kundra poonam pandey

పోర్న్​ కేసులో భాగంగా విచారణ ఎదుర్కొన్న నటి శిల్పాశెట్టి(shilpa shetty raj kundra relationship).. తన భర్త(రాజ్​కుంద్రా) కార్యకలాపాల గురించి తెలియదని అన్నారు. అశ్లీల చిత్రాలకు సంబంధించిన యాప్‌ల గురించి కూడా తనకు తెలియదని వెల్లడించారు.

rajkundra
రాజ్​కుంద్రా

By

Published : Sep 16, 2021, 10:18 PM IST

అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై(shilpa shetty raj kundra) ముంబయి పోలీసులు తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరునూ చేర్చారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా.. తన భర్త కార్యకలాపాల గురించి తనకు తెలియదని పోలీసులకు తేల్చి చెప్పారు.

'నా పనుల్లో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. రాజ్‌కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలియదు' అని వెల్లడించారు. పోలీసులు దాఖలు చేసిన 1,400 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పొందుపర్చారు. అలాగే అశ్లీల చిత్రాలకు సంబంధించిన యాప్‌ల గురించి కూడా తనకు తెలియదని ఆమె తెలిపారు.

ఈకేసులో భాగంగా రాజ్ కుంద్రాతో సహా కొంత మంది ఉద్యోగులను జులై 19న పోలీసులు అరెస్టు చేయగా.. వారిలో నలుగురు ఉద్యోగులు అతనికి వ్యతిరేక సాక్షులుగా మారినట్లు తెలుస్తోంది. కాగా, రాజ్‌కుంద్రాను కోర్టులో విచారిస్తున్న సందర్భంగా తాను తీసిన కంటెంట్‌ అసభ్యకరం కావచ్చు కానీ అశ్లీలమైనది కాదని ఆయన తెలిపారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి వీడియోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాజ్​కుంద్రా-శిల్పాశెట్టి విడిపోనున్నారా?

ABOUT THE AUTHOR

...view details