ఇమోజీలంటే ఎంటో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. మనిషి తన భావాలను వ్యక్తీకరిస్తూ సరదాగా ప్రియమైన వారికి మెస్సేజ్‌లో పంపే ఓ సిగ్నేచర్ ఇమోజీ. నేడు( జూన్ 17)న ప్రపంచ ఇమోజీ దినోత్సం. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇందులో అనేక రకాల ఇమోజీ ఎక్స్‌ప్రెషన్స్‌ను ప్రదర్శిస్తూ.. కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఎమోజీ హావభావాలతో కవ్విస్తోన్న శిల్పా శెట్టి
ప్రపంచ ఎమోజీ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో అనేక రకాల ఎమోజీ హావభావాలు ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరించింది.
శిల్పా శెట్టి
ఇటీవలే భారత్ నిషేధించిన చైనా యాప్ టిక్‌టాక్‌లోనూ ఈ భామ యాక్టీవ్‌గా ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరోగసి పద్దతి ద్వారా రెండో బిడ్డకు తల్లి అయ్యింది. సినీ కెరీర్‌కు చాలా కాలంగా దూరంగా ఉంటున్న శిల్ప.. 'నికమ్మ', 'హంగామా 2' చిత్రాలతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇదీ చూడండి:'భగవద్గీత సాక్షిగా' అంటోన్న సాయితేజ్!