అశ్లీల చిత్రాల కేసులో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్‌మీడియాలో తరచుగా పోస్ట్‌లు చేస్తోంది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. ఇప్పుడు మరోసారి 'మిస్టేక్స్' అనే పుస్తకం నుంచి కొన్ని వాక్యాలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ షేర్ చేసింది. జీవితంలో తప్పులు చేయడం సహజమని.. వాటిని దాటుకొని ముందుకు వెళ్లాలనేది దాని సారాంశం.
ఆ పుస్తకంలోని వాక్యాలను ఫొటో తీసి.. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో శిల్పాశెట్టి పోస్ట్ చేసింది. "జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో తప్పులు చేస్తూనే ఉంటారు" అనే వాక్యానికి.."తప్పు జరిగింది.. అయినా పర్లేదు" అనే స్టిక్కర్‌ను జతచేసింది. అయితే ఇది తన తర్వాతి జీవితానికి అన్వయించుకొని పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.