వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల వ్యాపారంపై ముంబయి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయనకు సంబంధించిన ఆఫీస్, ఇంటిపై సోదాలు చేసి పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను సీజ్ చేశారు. ఇందులో కుంద్రా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్‌తో పాటు హార్డ్ డిస్క్‌లు ఉన్నాయి.
అయితే ఈ కేసులో కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్న కుంద్రాతో పాటు ఆయన బావమరిది ప్రదీప్ భక్షికీ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు అధికారులు.
శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా ఆ షూటింగే పట్టిచ్చింది
నిజానికి రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు సోమవారం అరెస్టు చేసినా, ఐదు నెలల నుంచి అతనిపై నిఘా ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలాడ్ వెస్ట్‌లోని ఓ బంగ్లాపై దాడి సమయంలో కుంద్రా పేరు పోలీసుల దృష్టికి వచ్చింది. దాడి సమయంలో బంగ్లాలో ఓ అశ్లీల చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్టు చేశారు. విచారణ సందర్భంగా అశ్లీల చిత్రాల రాకెట్‌తో రాజ్‌కుంద్రాకు సంబంధం ఉందని పోలీసులకు తెలిసింది. అయితే బలమైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల అప్పుడు అరెస్టు చేయలేదు.
అది అశ్లీలం కాదు: గహనా
రాజ్‌కుంద్రా సంస్థలో మూడు సినిమాల్లో నటించిన నటి గహనా వశిష్ఠ్ ఆయనకు మద్దతుగా నిలిచారు. తాము అశ్లీల చిత్రాలు తీయలేదని, తమ సినిమాలు ఆ విభాగంలోకి రావని, పోలీసులే అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఫిబ్రవరిలో మలాడ్ వెస్ట్‌లో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో గహనా కూడా ఉన్నారు. ఇటీవల ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇవీ చూడండి