బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. మరోసారి మాతృత్వ అనుభవాన్ని పొందింది. ఈరోజు ఉదయం తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు చెప్పింది. ఈ విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసిందీ భామ. పాపకు 'సమిశ శెట్టి' అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది.
"ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిఫలంగా ఓ అద్భుతం జరిగింది. గుండెల నిండా ఆనందంతో మా చిట్టితల్లిని ఆహ్వానిస్తున్నాం. సమిశ శెట్టి కుంద్రా ఈరోజు పుట్టింది" -శిల్పాశెట్టి, నటి
శిల్పాశెట్టి కూతురు ఫొటో శిల్పాశెట్టి ఇన్స్టాగ్రామ్ పోస్ట్