తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒంటిని విల్లులా వంచుతున్న 'సాగరకన్య'

లాక్​డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అందువల్ల శరీరం ఫిట్​నెస్​ను కోల్పోతుందని అంటోంది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. అందుకోసం రోజూ సూర్యనమస్కారాలు చేయాలని చెబుతోంది. ఆమె యోగా చేస్తోన్న ఓ వీడియోను పంచుకుంది.

శిల్పా
శిల్పా

By

Published : Apr 13, 2020, 5:18 PM IST

శిల్పా శెట్టి ఈ పేరుని విననివారుండరు. నటిగా, యోగా చేస్తూ నిత్యం చురుగ్గా సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. శిల్పా కూడా లాక్‌డౌన్‌లోనే ఉంది. తాజాగా ఈ అమ్మడు సూర్యనమస్కారం చేస్తున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

"ఇంట్లోనే ఉండడం వల్ల శరీరీం కొంత గట్టిపడుతుంది. అయితే రోజూ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మన శరీరంలో మంచి మార్పులు వస్తాయి. మీరు కూడా ఈ సూర్య నమస్కారాన్ని ప్రయత్నించవచ్చు (మీకు ఎటువంటి ఇతర శారీరక ఇబ్బందులు లేకపోతే). వీడియోలో మీరు చూసిన మరికొన్నింటిని రోజుకు 8 నుంచి 16 సార్లు ప్రయత్నిస్తే మీ శరరీరంలో కొవ్వు తగ్గి చాలా ఉత్సాహంగా ఉంటారు. నాకు తెలిసిన ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. దయచేసి మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండండి."

-శిల్పా శెట్టి, హీరోయిన్

తెలుగులో శిల్పాశెట్టి వెంకటేశ్​తో కలిసి 'సాహసవీరుడు సాగరకన్య' చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్​లో పలువురు కథానాయకులతోనూ ఆడిపాడింది. ప్రస్తుతం ప్రియదర్శన్‌ దర్శకత్వంలో 'హంగామా 2'లో నటిస్తోంది. ఇందులో పరేష్‌ రావల్, ప్రణీత సుభాష్, మీజాన్‌ జాఫ్రీ తదితరులు నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details