ఎప్పుడూ స్టైల్‌గా, ఫిట్‌గా కనిపిస్తూ(shilpa shetty new hairstyle) సోషల్‌మీడియాలో అభిమానులను అలరించే బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్ శిల్పాశెట్టి ఈసారి సరికొత్త అవతారంలో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. సోమవారం(అక్టోబర్ 18) ఎరోబిక్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పోని స్టైల్లో ఉన్న తన కొత్త హెయిర్‌స్టైల్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది(shilpa shetty latest news). వెనకాల జుట్టును చిన్నగా ట్రిమ్ చేసింది. బూడిద రంగు టాప్, ట్రాక్ ధరించి వర్కౌట్స్ చేసింది.
"రిస్క్ తీసుకోకుండా, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకుండా ఒక్క రోజు కూడా జీవించలేము." అంటూ వర్కౌట్ వీడియోకు వ్యాఖ్య జోడించింది శిల్పా. అలాగే తన కొత్త ఎరోబిక్ వర్కౌట్స్ గురించి ప్రస్తావిస్తూ.. దీనిని 'ట్రైబల్ స్క్వాట్స్' అంటారు అని రాసింది. ఇలా చేయడం వల్ల చురుకుదనం పెరుగుతుందని, మెదడు పనితీరు బాగుంటుందని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు ఫిదా అవుతున్నారు. విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.