'బుట్టబొమ్మ' పాటకు బాలీవుడ్ భామ డ్యాన్స్ - ala vaikunthapurramloo collections
'అల వైకుంఠపురములో' సినిమాలో బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది నటి శిల్పాశెట్టి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
నటి శిల్పాశెట్టి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఇందులోని 'సామజవరగమన' ,'రాములో రాములా' పాటలు అంతకు ముందే ప్రాచుర్యం పొందాయి. చిత్ర విడుదల తర్వాత 'బుట్టబొమ్మ' గీతం అంతకంటే ఎక్కువగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాతో పాటు టిక్టాక్లోనూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడీ పాటకు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Last Updated : Feb 29, 2020, 5:16 PM IST