తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చీకటి వ్యాపారంపై రాజ్​ కుంద్రాను నిలదీసిన శిల్పా శెట్టి! - రాజ్​కుంద్రా అశ్లీల చిత్రాల కేసు

తన భర్త రాజ్ కుంద్రా అశ్లీల వ్యాపారం గురించి తనకేమీ తెలియదని శిల్పా శెట్టి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా రాజ్​ కుంద్రాను తన నివాసంలో ప్రశ్నించేందుకు తీసుకెళ్లగా.. 'ఇలా చేయవలసిన అవసరం ఏంటని' కుంద్రాను శిల్ప నిలదీసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Shilpa Shetty
శిల్పాశెట్టి

By

Published : Jul 27, 2021, 11:15 AM IST

Updated : Jul 27, 2021, 11:36 AM IST

రాజ్ కుంద్రా అశ్లీల వ్యాపారం గురించి తనకేమీ తెలియదని శిల్పా శెట్టి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా రాజ్​ కుంద్రాను తన నివాసంలో ప్రశ్నించేందుకు తీసుకెళ్లగా.. భర్త చేసే చీకటి వ్యాపారాల గురించి ఏమీ తెలియదని కన్నీరుమున్నీరైనట్లు ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి.

"దర్యాప్తులో భాగంగా రాజ్ కుంద్రాను ముంబయిలోని తన నివాసానికి తీసుకువెళ్లాం. అక్కడే శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించాం. విచారణ అనంతరం శిల్పా కలవరపాటుకు గురయ్యారు. ఆమె భర్తతో వాదనకు దిగారు. ఇలా చేయవలసిన అవసరం ఏముందని అరిచారు. ఆమె కోపాన్ని తగ్గించేందుకు పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది."

- ముంబయి క్రైమ్ బ్రాంచ్ వర్గాలు.

దర్యాప్తులో భాగంగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా సంయుక్త ఖాతాలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు క్రైమ్ బ్రాంచ్ కనుగొంది. 'హాట్​ షాట్స్', 'బాలీ ఫేమ్' యాప్ ద్వారా వచ్చే ఆదాయాలు ఈ ఖాతాలోకి వచ్చాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'ఈ యాప్ గురించి నాకేమీ తెలియదనివ్వలేదు. దీనివల్ల కుటుంబం అపఖ్యాతి పాలవుతోంది. అనేక కాంట్రాక్టులు రద్దవుతున్నాయి. కుటుంబం భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది' అని శిల్ప ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు వివరించాయి. సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న తను.. ఇలాంటి పనులు చేయవలసిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించినట్లు పేర్కొన్నాయి.

ఈ కేసులో కుంద్రాపై ఈడీ మనీలాండరింగ్​తో పాటు.. ఫెమా చట్టాల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అంతకుముందు శిల్పాశెట్టి పోలీసులపైనా అసహనం వ్యక్తం చేశారని సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Jul 27, 2021, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details