బాలీవుడ్ ఎవర్గ్రీన్ 'కూలీ నంబర్ 1'ను అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకుంది నటి శిఖా తలసానియా. ఇప్పటికే 'వేక్ అప్! సిద్', 'దిల్‌తో బచ్చా హై జీ', 'వీరే ద వెడ్డింగ్' లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఇవే కాకుండా టీవీషోలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ తనకు ఈ ఛాన్స్ రావడంపై ఆనందం వ్యక్తం చేసింది.
"డేవిడ్ ధావన్ దర్శకత్వంలో నటించాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. వాళ్లలో నేనూ ఉన్నాను. వరుణ్, సారాలతో నటించే అవకాశం వచ్చినపుడు మరో ఆలోచన లేకండా ఒప్పేసుకున్నా". -శిఖా తలసానియా, నటి