ముంబయి 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు నటుడు అడివి శేష్ (Adivi Sesh Major Movie). ఈ దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో కలిసి తాజ్మహల్ టవర్లోని స్మారకం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేజర్ సందీప్ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకుముందు ముంబయిలోని 26/11 పోలీస్ మెమొరియల్లో.. ఈ దాడిలో వందలాది ప్రాణాలను కాపాడే క్రమంలో అమరులైనవారికి నివాళులు అర్పించారు శేష్ (Adivi Sesh).