తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి' - సుశాంత్ సింగ్ రాజ్​పుత్ వార్తలు

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని నటీనటులు శేఖర్ సుమన్, రుపా గంగూలీ కోరారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

'సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి'
సుశాంత్ సింగ్ రాజ్​పుత్

By

Published : Jun 24, 2020, 4:17 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ రాజ్​పుత్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని కోరారు నటీనటులు శేఖర్ సుమన్, రూపా గంగూలీ. అతడు ఆత్మహత్య చేసుకున్నా సరే, అందుకు గల కారణాలను అన్వేషించాలని అన్నారు.

సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుశాంత్ ఫోరమ్ ప్రారంభించిన శేఖర్ సుమన్.. అధిక సంఖ్యలో నెటిజన్లు దీనికి మద్దతు తెలిపాలని కోరారు. సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. స్పందించిన నెటిజన్లు.. శేఖర్​ సుమన్​కు బాగానే మద్దతు తెలిపారు. దీని గురించి మాట్లాడిన శేఖర్.. సుశాంత్ విషయంలో నమ్మకం కోల్పోవద్దని చెప్పారు.

రూపా గంగూలీ.. #సీబీఐఫర్​సుశాంత్ హ్యాష్​టాగ్​తో ట్వీట్ చేశారు. మనం అనుకుంటున్నట్లు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నా సరే దీని గురించి లోతుగా విచారించాలని కోరారు. అందుకోసం సీబీఐ ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. దిగ్భ్రాంతి చెందిన ప్రజలు, అభిమానులు.. అతడి మృతిని జీర్ణించుకోలేకపోయారు. బాలీవుడ్​లోని నెపోటిజమ్​.. సుశాంత్ మరణానికి ప్రధాన కారణమని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులపై కేసులు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details