తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ పాట నా జీవితాన్నే మార్చేసింది: షెఫాలీ - కాంటాలాగా సాంట్

ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన రీమిక్స్ గీతం 'కాంటాలగా'. ఇందులో నటించిన షెఫాలీ జరివాలా ఆ పాటలో అవకాశం రావడం గురించి తాజాగా చెప్పుకొచ్చింది.

షెఫాలీ
షెఫాలీ

By

Published : May 17, 2020, 6:39 PM IST

ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన రీమిక్స్‌ గీతం ‌'కాంటాలగా' నటి షెఫాలీ జరివాలా ఈ మ్యూజిక్‌ వీడియోతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. షెఫాలీ ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజుల్లో దర్శకులు రాధికా రావు, వినయ్‌ సప్రు కళాశాల బయట ఆమెను చూసి ఆఫర్‌ ఇచ్చారు. అలా ఈ ఆల్బమ్‌తో ఆమె నటిగా మారారు. దీనికి విశేషమైన స్పందన వచ్చిన కారణంగా నటిగా కెరీర్‌ కొనసాగించాలనుకున్నారట. అయితే తను 'కాంటాలగా..' పాటలో నటించడం తన తండ్రికి ఇష్టం లేదని షెఫాలీ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

షెఫాలీ

"మా కుటుంబ సభ్యులంతా బాగా చదువుకుని, స్థిరపడ్డారు. కాబట్టి నేను కూడా చదువుపై దృష్టి పెట్టాలని నా తల్లిదండ్రులు చెప్పారు. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నా. ఆల్బమ్‌లో అవకాశం వచ్చినప్పుడు నటించాలి అనుకున్నా. అప్పట్లో ఆ ఒక్క పాటకు రూ.7 వేలు పారితోషికం ఇస్తామన్నారు. నన్ను నేను టీవీలో చూసుకోవాలనే కోరిక ఉండేది. కానీ మా నాన్న నాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. నటిస్తానంటే ఒప్పుకోలేదు. ముందు మా అమ్మలో నమ్మకం పెంచి, ఒప్పించా. ఆపై ఇద్దరం కలిసి నాన్న అనుమతి తీసుకున్నాం. ఆపై పాట సూపర్‌హిట్‌ అయ్యింది. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది"

-షెఫాలీ, నటి

'కాంటాలగా..' తర్వాత షెఫాలీ పలు మ్యూజిక్‌ వీడియోలలో నటించారు. పలు టీవీ షోలలో పాల్గొన్నారు. 'బేబీ కమ్‌ నా' అనే సిరీస్‌లోనూ నటించారు.

ABOUT THE AUTHOR

...view details