తొలిచిత్రం 'ఆర్‌ఎక్స్ 100'తోనే సంచలన హిట్ కొట్టారు దర్శకుడు అజయ్ భూపతి. రెండో సినిమాగా 'మహాసముద్రం' తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు'తో ఘనవిజయాన్ని అందుకున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.
'మహాసముద్రం'లో శర్వానంద్ ఫిక్స్ - మహాసముద్రం సినిమా అప్డేట్
హీరో శర్వానంద్.. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. దీనికి 'మహాసముద్రం' టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శర్వానంద్
'ఆర్ఎక్స్ 100' తరహాలోనే ఉండే విభిన్న కథతో ఈ సినిమా తీయనున్నట్లు అజయ్ భూపతి ఇదివరకే చెప్పారు. తెలుగు-తమిళ భాషాల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరపనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రతి వారం ఓ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ చిత్రం కోసం శర్వానంద్‌తో సహా మరో నటుడ్ని ఎంపిక చేస్తారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం హీరో సిద్ధార్థ్‌ను, హీరోయిన్గా సమంతను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.