తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన '96' చిత్రం గతేడాది ఘనవిజయం అందుకుంది. తెలుగులో రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.
'ప్రాణం' అంటూ సాగే ఈ పాటను చిన్మయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. గోవింద వసంత ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.