తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శర్వాకు బలమైన గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం - sharwanand

టాలీవుడ్​ యువ హీరో శర్వానంద్‌ 96 సినిమా షూటింగ్​లో గాయాలపాలయ్యాడు. థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.

హీరో శర్వానంద్‌కు షూటింగ్‌లో ప్ర‌మాదం

By

Published : Jun 16, 2019, 11:09 AM IST

Updated : Jun 16, 2019, 11:57 AM IST

టాలీవుడ్​ యువ హీరో శ‌ర్వానంద్‌కు `96` చిత్ర షూటింగ్‌లో గాయాల‌య్యాయి. చిత్రీకరణలో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. శిక్షకుల ఆధ్వ‌ర్యంలో శ‌ర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేసినప్పటికీ సేఫ్​గా ల్యాండ్​ అవ్వలేకపోయాడు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా దిగినా... ఐదోసారి గాలి ఎక్కువ‌గా వీచినందున ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఫలితంగా కాళ్ల‌పై కిందకి దిగాల్సిన వ్య‌క్తి భుజాల‌ను మోపి ల్యాండ్ అయ్యాడు.

ఈ ఘ‌ట‌న త‌ర్వాత శ‌ర్వానంద్ వెంట‌నే థాయ్‌లాండ్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. శ‌ర్వాకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్ట‌ర్లు భుజానికి బ‌ల‌మైన గాయం త‌గ‌లింద‌ని, శస్త్ర చికిత్స అవ‌స‌రమ‌ని సూచించారు. సోమ‌వారం ఈ శ‌స్ర‌చికిత్స జ‌రగ‌నుంది. అనంతరం క‌నీసం నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల‌ని శ‌ర్వానంద్​కు సూచించారు వైద్యులు.

Last Updated : Jun 16, 2019, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details