యువ కథానాయకుడు శర్వానంద్ జోరు మాములుగా లేదు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ విషయాన్ని శర్వానే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ అవి ఏంటంటే?
శర్వానంద్ ఫేస్బుక్ పోస్ట్ 'శ్రీకారం'లో రైతుగా
నూతన దర్శకుడు కిశోర్ తీస్తున్న 'శ్రీకారం'లో, శర్వానంద్ రైతుగా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. 14 రీల్స్ ప్లస్ పతాకంపై గోపీచంద్, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుందీ సినిమా.
శ్రీకారం సినిమా కొత్త లుక్ ద్విభాషా చిత్రం
#శర్వానంద్30 పేరుతో రూపొందిస్తున్న ఓ చిత్రంలోనూ శర్వానంద్ నటిస్తున్నారు. శ్రీ కార్తిక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది.
'మహాసముద్రం'లో సిద్ధార్థ్‌తో
'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి తీస్తున్న 'మహాసముద్రం'లోనూ శర్వానంద్ ఓ హీరోగా చేస్తున్నారు. సిద్ధార్థ్ మరో కథానాయకుడు. అదితీ రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు.
రష్మికతో 'ఆడాళ్లూ మీకు జోహార్లు'
స్టార్ బ్యూటీ రష్మికతోనే నటించేందుకు సిద్ధమయ్యారు శర్వానంద్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమా చేస్తున్నారు. దసరా సందర్భంగా ఆదివారమే లాంఛనంగా ప్రారంభమైంది.
ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రారంభోత్సవం