టాలీవుడ్ హీరో శర్వానంద్, సిద్దార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ 'మహాసముద్రం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో సినిమా చేయడం, దర్శకుడి తొలి సినిమా హిట్ కావడం వల్ల ఈ మూవీపై సినీప్రియుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం జోరుగా ప్రచారం సాగుతోంది.
mahasamudram movie: శర్వా కన్నా సిద్ధార్థ్‌కు తక్కువే! - మూవీ న్యూస్
'మహాసముద్రం' సినిమా కోసం హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వారి పారితోషికం ఎంతంటే?
మహాసముద్రం
ఈ సినిమా కోసం శర్వానంద్ రూ. 5కోట్లు, సిద్ధార్థ్ రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే శర్వా.. కరోనా వల్ల తన పారితోషికాన్ని ఇంకా తగ్గించుకున్నారట. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి:'మహాసముద్రం' సాంగ్‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్స్!