'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త చిత్రం 'మహాసముద్రం'. ఇందులో శర్వానంద్-సిద్ధార్ధ్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. శర్వానంద్ కెరీర్లో 'గమ్యం', 'ప్రస్థానం' తర్వాత మళ్లీ అలాంటి బలమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారట. ఈ సినిమాలో శర్వా, సిద్ధార్ధ్ బ్యాడ్బాయ్స్గా నటించనున్నారని.. వారి మధ్య ఓ యాక్షన్ సన్నివేశం కూడా ఉందని సమాచారం.
ఇద్దరు బ్యాడ్‌బాయ్స్ కథే 'మహాసముద్రం'! - శర్వానంద్ సిద్ధార్ధ్
'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్, సిద్ధార్ధ్ బ్యాడ్బాయ్స్గా కనిపించనున్నారట. ఇందులో వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సన్నివేశం ఉంటుందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
![ఇద్దరు బ్యాడ్‌బాయ్స్ కథే 'మహాసముద్రం'! Sharwanand and Siddharth were playing the Negative roles in the movie of Mahasamudram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10294153-thumbnail-3x2-hd.jpg)
ఇద్దరు బ్యాడ్‌బాయ్స్ కథే 'మహాసముద్రం'!
ప్రేమకథ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మహాసముద్రం'.. త్వరలోనే రెండో షెడ్యూల్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలోనే సినిమాను రూపొందిస్తున్నారు.