"ఎగసి పడే కెరటాలను ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం ఎదురు చూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం.. నీతో ఒక నవ్వు కోసం.. రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పు ఇవ్వలేవా" అంటూ తన ప్రేయసి గురించి కవిత అందుకున్నాడు యువ కథానాయకుడు శర్వానంద్. ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి అతడు కీలక పాత్రలో నటించిన చిత్రం 'జాను'. తమిళ సూపర్‌హిట్ '96'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. యువ హృదయాలను ఆకట్టుకునేలా, భావోద్వేగాల సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.
ట్రైలర్: 'జాను' కోసం శర్వానంద్ ఎదురుచూపులు..! - దిల్ రాజు
తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన '96' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో 'జాను' తెరకెక్కించారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో శర్వానంద్, సమంత సంభాషణలు యువతను ఆకట్టుకుంటున్నాయి.
![ట్రైలర్: 'జాను' కోసం శర్వానంద్ ఎదురుచూపులు..! Sharwanand-and-Samantha-Jaanu-Trailer-released](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5886383-494-5886383-1580304562516.jpg)
"ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా, ఏదో జరగబోతోందని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంది" అని చెప్పిన సమంతకు, "పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే" అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'జాను' ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తుండగా, గోవింద్ వసంత్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదీ చూడండి...నాని కొత్త గెటప్.. అలరిస్తున్న రాక్షసుడు లుక్