శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రీతూవర్మ కథానాయిక. శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్.ప్రభు నిర్మాత. దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాస్తున్నారు. లాక్‌డౌన్ ముగిశాక పునః ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది.
శర్వానంద్ @30 షూటింగ్ పూర్తి.. కీలకపాత్రలో అమల - శర్వానంద్ 30
టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. లాక్‌డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైన చిత్రీకరణ మంగళవారం ముగిసింది. దీనికి సంబంధించిన చిత్రాలను సోషల్మీడియాలో పంచుకుంది చిత్రబృందం. అక్కినేని అమల ఇందులో కీలకపాత్రలో నటించారు.
శర్వానంద్ @30 షూటింగ్ పూర్తి.. కీలకపాత్రలో అమల
"శర్వానంద్ 30వ చిత్రమిది. కుటుంబ ప్రేక్షకుల్లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. వాళ్లతోపాటు యువతరాన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తల్లీకొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే సన్నివేశాలు హత్తుకుంటాయి. అమల అక్కినేని ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి పాత్రలూ అలరిస్తాయి. త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు జేమ్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.