ఏపీలోని తిరుపతి శివారు తుమ్మలగుంటలో శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న కొత్త చిత్రం " ఆడాళ్లు మీకు జోహార్లు" లాంఛనంగా ప్రారంభమైంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశాన్ని తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో చిత్రీకరించారు.
ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో చిత్రం నిర్మాత చెరుకూరి సుధాకర్, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మేడా మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.