తెలంగాణ

telangana

'బిగిల్' ట్రైలర్​లో షారుఖ్​​ను గమనించారా..?

By

Published : Oct 15, 2019, 6:19 PM IST

కోలీవుడ్​ స్టార్ హీరో విజయ్​, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్​లో వస్తోన్న చిత్రం 'బిగిల్​'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్​కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో షారుఖ్​కు​ సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బిగిల్ ట్రైలర్​లో షారుఖ్​ ఖాన్​​ను చూశారా..?

తమిళ చిత్రసీమలో మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు 'తలపతి' విజయ్​. తాజాగా అట్లీ దర్శకత్వంలో అతడు నటించిన 'బిగిల్‌' చిత్రానికి నెట్టింట భారీ క్రేజ్​ ఏర్పడింది. ఎంతగా అంటే శనివారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్​ విడుదల కాగా.. ఒక్క యూట్యూబ్​లోనే ఇప్పటికే 2కోట్ల 73 లక్షల మంది ఆ వీడియోను చూశారు. ఇందులో విజయ్​ ​రెండు పాత్రల్లో కనిపించాడు.

షారుఖ్​ కనిపించాడా..?

'బిగిల్​' ట్రైలర్​లో షారుఖ్​ ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. ఈ బాలీవుడ్​ బాద్​షా గతంలో పోషించిన 'చక్​ దే ఇండియా' సినిమాలో ఓ సన్నివేశం ఈ తాజా సినిమాలోనూ సందడి చేస్తోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలను నెటిజన్లు షేర్​ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ఆ సీన్​ వాడుకునేందుకు షారుఖ్​, హిందీ చిత్రబృందం అనుమతి తీసుకున్నారా లేదా.. అనేది తెలియాల్సి ఉంది.

విశేషమేంటంటే ఈ సినిమా తెరకెక్కించిన అట్లీ దర్శకత్వంలో షారుఖ్​ ఓ మూవీ చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుందట.

పండుగలా...

తమిళనాడులోని చాలా థియేటర్లలో ట్రైలర్‌ విడుదలను పెద్ద కార్యక్రమంగా నిర్వహించారు. 'బిగిల్​' ఛాంపియన్​షిప్​ పేరిట ఫుట్​బాల్​ టోర్నీని నిర్వహిస్తున్నారు.

కథ ఇదేనా..?

ఫుట్‌బాల్‌లో శిఖరాగ్రాలను తాకిన విజయ్‌ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ రంగం నుంచి తప్పుకుని.. సాధారణ జీవనం సాగిస్తుంటాడు. తర్వాత మహిళా జట్టుకు కోచ్‌గా ఎంపికవుతాడు. అనంతరం తన యాక్షన్‌ గేమ్‌ను ప్రారంభిస్తాడని స్పష్టమవుతోంది.

"నువ్వు చాలా పెద్ద యాక్షన్‌ హీరో అయిపోయావ్‌. 'కాదలుక్కు మరియాదై' అంతా నువ్వు మరిచిపోయినట్లున్నావ్‌" అని నయనతార చెప్పే డైలాగు ప్లస్‌ పాయింట్‌గా నిలుస్తోంది. "నాకు ఫుట్‌బాల్‌ అంత తెలియదు. కానీ, నా ఆట రచ్చరచ్చగా ఉంటుంది" అని విజయ్​ చెప్పే డైలాగూ ఆకట్టుకుంటోంది.

సాధారణంగా విజయ్‌ అభిమానులు కోరుకునే మాస్‌, యాక్షన్‌, సందడి, రొమాన్స్‌, కామెడీ అన్నీ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. అదేస్థాయిలో సినిమా ఉంటే తప్పకుండా రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు చెబుతున్నారు. ఇటీవల విజయ్‌ నటించిన చిత్రాల్లో రాజకీయ సంబంధిత డైలాగులు ఉండేవి. కానీ ఈ ట్రైలర్‌లో అవి కనిపించడం లేదు. ఏజీఎస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చాడు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details