బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను హత మార్చేందుకు వేసిన కుట్రను హరియాణా ఫరీదాబాద్ పోలీసులు ఛేదించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని షార్ప్ షూటర్ రాహుల్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కృష్ణ జింకలను సల్మాన్ వేటాడినందుకు అతడిపై కోపం పెంచుకున్న లారెన్స్.. భాయ్‌ను చంపించేందుకు యత్నించాడని అధికారులు వెల్లడించారు.
హీరో సల్మాన్‌ఖాన్ హత్యకు కుట్ర.. కారణం అదే - సల్మాన్‌ఖాన్‌పై దాడి
ప్రముఖ హీరో సల్మాన్‌ను చంపేందుకు యత్నించిన షార్ప్ షూటర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణ జింకలను వేటాడినందుకే అతడిపై కోపం పెంచుకున్న ఓ గ్యాంగ్‌స్టర్.. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
సల్మాన్‌ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ను చంపే బాధ్యతను రాహుల్‌కు అప్పగించాడు లారెన్స్. అతడు గత జనవరిలో ముంబయి వెళ్లాడు. బాంద్రాలోని సల్మాన్ భవంతి వద్ద రెక్కీ నిర్వహించి, చంపేందుకు యత్నించి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేసి విచారించగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది చూడండి 'పీపీఈ కిట్ల కోసం పెయింటింగ్స్ వేలం'