తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానున్న ఏడాది నాకు ఎక్స్​ట్రార్డినరీ: షాలినీ పాండే - విజయ్ దేవరకొండ షాలినీ పాండే

27వ పుట్టినరోజు జరుపుకొన్న నటి షాలినీ పాండే.. రానున్న సంవత్సరం తన జీవితం అద్భుతంగా ఉండనుందని జోస్యం చెప్పింది. అందుకు గల కారణాల్ని వెల్లడించింది.

Shalini Pandey turns 27, hopes the new year is extraordinary
షాలినీ పాండే

By

Published : Sep 23, 2020, 10:46 AM IST

రానున్న ఏడాది తనకు అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది 'అర్జున్​రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే. 27వ పుట్టినరోజు జరుపుకొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. రణ్​వీర్ సింగ్​ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమాతో బాలీవుడ్​ అరంగేట్రం చేయనుంది. షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం.. కచ్చితంగా థియేటర్లలోనే విడుదలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది షాలిని.

"రానున్న ఏడాది నాకు ఎక్స్​ట్రార్డినరీగా ఉంటుందని అనుకుంటున్నాను. నా సినిమా 'జయేష్ భాయ్ జోర్దార్' కచ్చితంగా థియేటర్లలోనే విడులవుతుంది. దానికోసం ఎదురుచూస్తున్నాను. జనజీవనం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మా సినిమా ప్రజల్ని థియేటర్​కు రప్పిస్తుందని అనుకుంటున్నాను" -షాలినీ పాండే, హీరోయిన్

'అర్జున్​రెడ్డి'తో వెండితెరకు పరిచయమైన షాలిని.. ఆ తర్వాత తెలుగులో '118', 'మహానటి', 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రాల్లో నటించింది. 'నిశ్శబ్దం'తో త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details