తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మణిరత్నం డైరెక్షన్​లో అజిత్ భార్య రీఎంట్రీ! - సఖి

'సఖి' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను తన ప్రేమలో పడేసిన నటి షాలినీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్​ స్టార్​ అజిత్​ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన ఆమె.. మణిరత్నం దర్శకత్వంలోనే పునరాగమనం చేయనున్నట్లు సమాచారం.

shalini ajith to make a comeback in tamil cinema with ponniyin selvan
మణిరత్నం డైరెక్షన్​లో అజిత్ భార్య రీఎంట్రీ!

By

Published : Feb 14, 2021, 5:31 AM IST

దాదాపు రెండు దశబ్దాల తర్వాత హీరోయిన్ షాలినీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. బాలనటిగా దక్షిణాదిలో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'సఖి'తో కథానాయికగా అలరించింది. నటిగా రాణిస్తున్న తరుణంలో హీరో అజిత్‌ను ప్రేమ వివాహం చేసుకుని కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అలా, 2001లో విడుదలైన 'ప్రియద వరం వెండూమ్‌' తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు.

అజిత్, షాలినీ

కాగా, షాలినీ మరోసారి వెండితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కథానాయికగా ఆమెకు బ్రేక్‌ ఇచ్చిన మణిరత్నం చిత్రంతోనే ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ మేరకు త్రిష, కార్తి, ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కిస్తోన్న 'పొన్నియిన్‌ సెల్వన్‌‌'లో షాలినీ ఓ కీలకపాత్ర పోషించనున్నారని గత కొన్నిరోజులుగా వరుస కథనాలు వస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూట్‌లో షాలినీ త్వరలోనే భాగం కానున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

'చెలి'లో మాధవన్, షాలినీ

ఇదీ చూడండి:'చిరంజీవి సార్ ఫోన్​ చేసి అలా అన్నారు'

ABOUT THE AUTHOR

...view details