తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముందు ప్రేమకథ.. తర్వాత 'హిరణ్య కశ్యప'

విభిన్న చిత్రాల దర్శకుడు గుణశేఖర్​ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న 'హిరణ్య కశ్యప' ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కనపెట్టారు. నటీనటుల డేట్స్​ కుదరకపోవడం వల్ల దాని కంటే ముందుగా 'శాకుంతలం' అనే ప్రేమకథా చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు.

Shakuntam will be made before Hiranya Kashyapa: Gunasekhar
'హిరణ్య కశ్యప' కంటే ముందే 'శాకుంతలం' ప్రేమకథ

By

Published : Oct 9, 2020, 9:51 PM IST

ముందు ప్రేమకథ.. తర్వాత 'హిరణ్య కశ్యప'

తెలుగు చిత్రపరిశ్రమలో పౌరాణిక, సాంఘీక చిత్రాల దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్‌. 'రుద్రమదేవి' చిత్రం తర్వాత రానా ప్రధానపాత్రలో 'హిరణ్య కశ్యప' అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఎప్పుడో సెట్స్‌పైకి తీసుకెళ్లాల్సినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇంకా పట్టాలెక్కలేదు.

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని చిత్రాల ప్రణాళికలూ తారుమారయ్యాయి. నటీనటుల డేట్స్‌ కుదరకపోవడం వల్ల దర్శకులు ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి మరో సినిమా తెరకెక్కించే సందర్భాలను సినీపరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. గుణశేఖర్‌ కూడా ఇదే అనుసరిస్తున్నారు. 'హిరణ్య కశ్యప' చిత్రీకరణకు మరింత సమయం ఉండటం వల్ల ఈ గ్యాప్‌లో మరో చిత్రం ప్రకటించారు గుణశేఖర్​. తాజాగా టైటిల్‌ ఖరారు చేసి, మోషన్‌ పోస్టర్‌ వీడియో పంచుకున్నారు. ఇతిహాస ప్రేమకథతో కూడిన ఈ చిత్రానికి 'శాకుంతలం' అనే టైటిల్​ను ఖరారు చేశారు.

"హిరణ్య కశ్యప'గా వెండితెరపై నరసింహ అవతారాన్ని చూపించడానికి ముందు మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమకథను చూపిస్తున్నాం" అని గుణశేఖర్‌ ట్వీట్​ చేశారు. ఈ చిత్రానికి నిర్మాతగా గుణ నీలిమ వ్యవహరిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. ఇందులోని తారాగణం వివరాలు తెలియాల్సిఉంది.

ABOUT THE AUTHOR

...view details