కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా "పర్యావరణానికి నష్టం జరుగుతుంది.. కాపాడండి" అంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారీ డైరెక్టర్. యురేనియం నిల్వల కోసం నల్లమల అడవుల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. వీటిని ఆపాలని ట్విటర్లో గళమెత్తారు.
"నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణా నది, దాని ఉపనదులు కలుషితం అవుతాయి." -శేఖర్ కమ్ముల, దర్శకుడు