ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'. తాజాగా ఈ కార్యక్రమానికి హాజరైన నటులు షకీలా, అనురాధ తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో నటి సిల్క్ స్మిత్‌కు, తనకు మధ్య గొడవలున్నాయన్న వార్తలపై స్పందించారు షకీలా.
'డర్టీ పిక్చర్' పెద్ద హంబక్ మూవీ: షకీలా - షకీలా సిల్క్ స్మిత
ఆలీ వ్యాఖ్యాతగా 'ఈటీవీ'లో ప్రసారమవుతున్న 'ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి తాజాగా షకీలా, అనురాధ విచ్చేశారు. తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"ఓ సీన్లో సిల్క్ అక్క నన్ను కొట్టింది. అందుకే ఆ అక్క అంటే నాకు ఇష్టం లేదు. నేను ఆమె సినిమాలోనే చెల్లెలిగా ఇంట్రడ్యూస్ అయ్యాను. అందుకే నాకు ఆమె అంటే గౌరవం ఉంది. 'డర్టీ పిక్చర్'లోనైనా సరే నా బయోపిక్ 'షకీలా'లోనైనా సరే నేను తనకు విరోధిగా వచ్చానని పెద్ద తప్పు వచ్చింది. అది లేనే లేదు. నేను చాలా ఇంటర్వ్యూల్లో క్లారిటీ కూడా ఇచ్చాను. నేను 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు చెల్లెలిగా సినిమాల్లో పరిచయం అయ్యాను. తర్వాత అక్క నాకు పెద్దగా పరిచయమే లేదు. అండ్ దెన్ షీ డైడ్. ఇప్పుడు అక్క బతికి లేదు. లేదంటే చెప్పేది. ఇది షకీలా కాదు అనురాధా అని. విషయమే తెలియకుండా ఓ బయోగ్రఫీ తీయడం తప్పు. 'డర్టీ పిక్చర్' టోటల్ హంబక్" అంటూ క్లారిటీ ఇచ్చారు షకీలా.