బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులకు గుడ్‌న్యూస్! రెండేళ్లకు పెగా వెండితెరకు దూరమైన ఆయన.. త్వరలో మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. వరుస ప్లాఫ్‌లు ఎదురవడం వల్ల ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చాలా కథలు విన్నారు. కొన్నింటికి గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అందులో భాగంగానే 'పఠాన్'కు ఓకే చెప్పారు. ఇవాళ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దాదాపు 881 రోజుల తర్వాత షారుక్ ముఖానికి రంగేసినట్లు సమాచారం. ముంబయిలోని యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో షారుక్ ఖాన్ కనుపించగా.. అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.
881 రోజుల తర్వాత.. చిత్రీకరణలో పాల్గొన్న షారుక్! - ముఖానికి రంగేసిన షారుఖ్ ఖాన్
షారుక్ ఖాన్-దీపిక జంటగా తీయనున్న 'పఠాన్' సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ముంబయిలోని యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో షారుక్ కనువిందు చేయడం వల్ల ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నారు.
షారుఖ్ ఖాన్
'వార్'తో హిట్ కొట్టిన సిద్థార్థ్ ఆనంద్.. పఠాన్ చిత్రానికి దర్శకుడు. దీపికా పదుకొణె హీరోయిన్. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా కథతో తీస్తున్న ఈ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Last Updated : Nov 18, 2020, 3:46 PM IST