హాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 'డిస్నీ' మరో ప్రతిష్ఠాత్మక చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. 'లయన్ కింగ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సినిమాలోని హిందీ వెర్షన్లో ప్రధాన పాత్రలకు ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్, ఆయన కుమారుడు గాత్రమందించారు. ‘ముఫాసా’ పాత్రకు షారుఖ్, ‘సింబా’కు తనయుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ అందిస్తున్నారు. ఇటీవలే షారుఖ్ డబ్బింగ్ చెప్తున్న ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తన హావభావాలతో అందర్ని ఆకట్టుకుంటున్నాడు బాలీవుడ్ బాద్షా.
'లయన్' హావభావాలతో అదరగొట్టిన షారుఖ్ - సింబా
'లయన్ కింగ్' హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ చెపుతున్న షారుఖ్ ఖాన్ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
'లయన్' హావభావాలతో అదరగొట్టిన షారుఖ్‌ఖాన్
తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పనున్నారు. ‘ఐరన్ మ్యాన్’, ‘ది జంగిల్ బుక్’లతో ఆకట్టుకున్న జాన్ ఫేర్యూ దర్శకత్వం వహించాడు.
ఇది చదవండి: బాలీవుడ్ కింగ్ ఖాన్‌కు మరో డాక్టరేట్