'జెర్సీ' బాలీవుడ్ రీమేక్ సినిమా విడుదల తేదీని ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఇందులో షాహిద్ కపూర్ ప్రధానపాత్ర పోషించగా.. మృనాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ కీలకపాత్రల్లో నటించారు.
బాలీవుడ్ 'జెర్సీ' విడుదల తేదీ ఖరారు - హిందీ జెర్సీ విడుదలకు ముహూర్తం ఖరారు
టాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలిచిన 'జెర్సీ' చిత్రం అదే పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీను ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
![బాలీవుడ్ 'జెర్సీ' విడుదల తేదీ ఖరారు shahid kapoor's Jersey movie arrives in theaters for this diwali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10272928-thumbnail-3x2-jersey-hd.jpg)
బాలీవుడ్ 'జెర్సీ' విడుదల తేదీ ఖరారు
మాృతకను రూపొందించిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ దర్శకత్వం వహించారు. జెర్సీ హిందీ రీమేక్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా ఉండగా.. అమన్ గిల్, దిల్ రాజు, నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇదీ చూడండి:మెడలో రుద్రాక్షతో 'సిద్ధ'గా రామ్‌చరణ్