కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రానున్న 21 రోజులు, దేశంలో లాక్డౌన్ పరిస్థితి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు పలువురు సెలబ్రిటీలు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. అభిమానుల ప్రశ్నలకు ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ లాక్డౌన్ సమయంలో 'కబీర్ సింగ్' అయితే ఏం చేస్తాడన్న ఓ నెటిజన్ ప్రశ్నకు బదులుగా, ప్రీతి(కుక్క)ని గట్టిగా హగ్ చేసుకుంటానని అన్నాడు.
లాక్డౌన్ సమయంలో 'కబీర్ సింగ్' ఏం చేస్తాడంటే? - corona latest news
ప్రస్తుతమున్న లాక్డౌన్ పరిస్థితుల్లో 'కబీర్ సింగ్' అయితే ఏం చేస్తాడన్న ఓ నెటిజన్ ప్రశ్నకు ఆసక్తికర సమధానమిచ్చాడు హీరో షాహిద్ కపూర్. ఇప్పుడది వైరల్‌గా మారింది.
షాహిద్ కపూర్ కియారా అడ్వాణీ
షాహిద్ కపూర్ 15 ఏళ్ల సినీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'కబీర్ సింగ్'. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'అర్జున్ రెడ్డి'కి రీమేక్‌గా దీనిని తీశారు. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది. ఇదే సినిమా తమిళంలో 'ఆదిత్య వర్మ'గా విడుదలైంది.