తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కబీర్ సింగ్​'తో లెక్కలు మార్చేసిన షాహిద్ - షాహిద్ కపూర్

'అర్జున్​రెడ్డి'కి రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కింది 'కబీర్ సింగ్'. బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకొని.. 200 కోట్ల క్లబ్ లో చేరిపోయిందీ చిత్రం. ఈ హిట్​తో ఒక్కసారిగా పారితోషికం పెంచేశాడు షాహిద్.

కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్

By

Published : Jul 14, 2019, 3:43 PM IST

షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'కబీర్ సింగ్' 200 కోట్ల క్లబ్ దాటి 300 కోట్ల దిశగా అడుగులేస్తోంది. ఓవర్ నైట్ లో పెద్ద హిట్​ అందుకున్న ఈ హీరో.. పారితోషికం విషయంలో తగ్గేది లేదంటున్నాడు. కబీర్ సింగ్ విడుదలకు ముందు ఓ చిత్రానికి 15 కోట్లు అందుకున్న షాహిద్.. ప్రస్తుతం 35 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.

తనతో సినిమా తీయాలనుకునే దర్శక, నిర్మాతలకు ఈ విషయాన్ని ముందే చెప్పేస్తున్నాడట షాహిద్. బాలీవుడ్ లో ఇంతవరకు ఈ స్థాయి విజయాన్ని అందుకోలేదు ఈ హీరో. తొలిసారి వంద కోట్ల క్లబ్​లో చేరిన షాహిద్​.. కబీర్​సింగ్ విజయంతో వచ్చిన క్రేజ్​ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

'అర్జున్ రెడ్డి' సినిమానే తమిళంలో 'ఆదిత్య వర్మ' గా తీస్తున్నారు. ఇందులో హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

ఇది చదవండి: WC19: టాస్​ గెలిస్తే బ్యాటింగ్​కే ఓటు..!

ABOUT THE AUTHOR

...view details