తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం సొంతం చేసుకున్న సినిమా 'జెర్సీ'. హిందీలోనూ అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా(Jersey Hindi Movie) రీమేక్ అయింది. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి.. హిందీలోనూ దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది(Jersey Trailer Released).
'శ్యామ్‌సింగరాయ్' సినిమాలోని ఏదో ఏదో సాంగ్ ప్రోమో విడుదలైంది(Shyamsinghroy song promo). నవంబరు 25న పూర్తి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ కానుంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఈ సినిమాలో నాని.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు(nani shyam singhroy movie). మిక్కీ జే మేయర్ సంగీతమందించగా, రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈనెల 24న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.