తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కబీర్​సింగ్' డబ్బులతో ఇల్లు కొన్న షాహిద్..! - Kanir Singh

'కబీర్​సింగ్' విజయంతో మంచి జోష్ మీదున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్​ కపూర్. ఆ చిత్రమిచ్చిన ఆనందంతో కుటుంబం కోసం ముంబయిలో ఓ ఇల్లు కొనుగోలు చేశాడట.

Shahid kapoor buy A House on Kabirsingh Movie Money
షాహిద్ కపూర్

By

Published : Dec 27, 2019, 11:06 PM IST

ఈ ఏడాది బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ను 'కబీర్​సింగ్' రూపంలో అద్భుత విజయం వరించింది. తన సినీ జీవితంలోనే అత్యంత పేరు తెచ్చిన చిత్రంగా నిలిచిపోయింది. తెలుగులో సూపర్ హిట్టయిన 'అర్జున్‌రెడ్డి'కి రీమేక్​గా తెరకెక్కి కాసుల వర్షం కురిపించింది. ఆ ఆనందంలో ముంబయిలో ఓ ఇల్లు కొన్నానని చెప్పాడు షాహిద్ కపూర్.

"ఈ ఏడాది నాకెంతో సంతోషకరమైన, తృప్తికరమైన ఆనందాన్ని ఇచ్చింది. నటుడు అన్నాక అన్నీ రకాల పాత్రలు చేయాలి. అందుకే 'కబీర్‌సింగ్‌' ఎలాంటి సినిమా, పాత్ర ఎలాంటిది అన్న విషయం నేను పట్టించుకోలేదు. కానీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చాలామంది వ్యక్తుల జీవితాలకు దగ్గరగా ఉండడం వల్లే ఇంతటి విజయాన్ని సాధించింది. మనిషికి వృత్తి ఎంత ముఖ్యమో, కుటుంబం కూడా అంతే ముఖ్యం. అందుకే నా కుటుంబం కోసం ముంబయిలో ఓ మంచి ఇల్లు కొనుగోలు చేశా." -షాహిద్ కపూర్​, బాలీవుడ్ నటుడు

భారత్​లో ఈ ఏడాది గూగుల్‌ల్లో అత్యధికంగా శోధించిన సినిమా జాబితాల్లో 'అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌', 'గల్లీబాయ్‌'లాంటి సినిమాలను 'కబీర్‌సింగ్‌' దాటేసింది. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌.. టాలీవుడ్​ హీరో నాని నటించిన 'జెర్సీ' చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్​లో రీమేక్ చేస్తున్నాడు.

ఇదీ చదవండి: మెగాహీరో సాయితేజ్​ కెరీర్​లోనే తొలిసారి

ABOUT THE AUTHOR

...view details