బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుక్ ఖాన్ చివరిసారిగా కనిపించిన చిత్రం 'జీరో'. 2018 తర్వాత షారుక్ మరో కొత్త చిత్రం చేయలేదు. ప్రస్తుతం ఆయన 'పఠాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుక్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు.
యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షారుక్ రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్నారట. ఇప్పుడు షారుక్ ఖాన్ భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన హీరో. ఇదే విషయాన్ని సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలౌతోంది.