బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ 'మన్నత్' (నివాసం)ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. అయితే ఈ విధంగా చేయడానికి కరోనాయే కారణమని నెట్టింట్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో కొందరు ప్రముఖులు మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలోనే షారుఖ్ ముందు జాగ్రత్తగా తన ఇంటికి రక్షణ కల్పించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని ఆధారాలు వెలువడిన నేపథ్యంలో వీటికి మరింత బలం చేకూరింది.
షారుఖ్ నివాసానికి ప్లాస్టిక్ కవర్లతో రక్షణ.. కారణం ఇదే!
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ నివాసం 'మన్నత్'ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, కరోనా బారిన పడకుండా షారుఖ్ ముందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
షారుఖ్ ఖాన్
అయితే, అసలు విషయం ఏంటంటే.. ఏటా రుతుపవనాల సమయంలో షారుఖ్ తన నివాసాన్ని ఇలా ప్లాస్టిక్ షీట్స్‌తో కప్పేస్తాడు. ఈ సారి కూడా ఆ విధంగానే చేశాడు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి షారుఖ్ తన కుటుంబంతో కలిసి ముంబయిలోని తన ఇంట్లోనే ఉంటున్నాడు.
షారుఖ్ ఖాన్ చివరగా 2018లో 'జీరో' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత కింగ్ ఖాన్ నుంచి ఎటువంటి సినిమా రాలేదు. ఇటీవలే ఓ వెబ్‌సిరీస్ నిర్మాణ పనులతో బిజీగా మారాడు.