హాలీవుడ్ చిత్రం 'ద లయన్ కింగ్' హిందీలోనూ విడుదలకానుంది. అయితే ఈ సినిమాలో రాజు సింహం ముఫాస, పిల్ల సింహం సింబలకు షారుక్ ఖాన్, అతడి తనయుడు ఆర్యన్ డబ్బింగ్ చెప్పనున్నారు.
తమ కుటుంబంలో అందరికీ 'ద లయన్ కింగ్' సినిమా అంటే ఇష్టమని తెలిపాడు షారుక్. "ఒక తండ్రిగా పెద్ద సింహం ముఫాసకు నేను, పిల్ల సింహం సింబకు ఆర్యన్ డబ్బింగ్ చెప్పనున్నాం" అని ప్రకటించాడీ బాలీవుడ్ హీరో. అబ్రామ్ కూడా ఈ సినిమా చూడనుండటం మరింత ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపాడు.