తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిషేక్​తో షారుఖ్.. అధికారిక ప్రకటన - బాలీవుడ్ సినిమాలు

బాలీవుడ్ కథానాయకుడు అభిషేక్ బచ్చన్ హీరోగా షారుఖ్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. వచ్చే ఏడాది ప్రథామార్ధంలో సెట్స్​పైకి వెళ్లనుందీ మూవీ.

షారుఖ్

By

Published : Nov 25, 2019, 3:44 PM IST

'జీరో' చిత్ర ఫలితం షారుఖ్‌ ఖాన్‌కు పెద్ద షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్నా ఈ హీరో నుంచి ఇంతవరకు మరే కొత్త చిత్ర ప్రకటనా బయటకి రాలేదు. ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని చూడటమే షారుఖ్‌ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. కానీ, ఇప్పుడు బాద్​షా నుంచి ఓ కొత్త సినిమా అధికారిక ప్రకటన బయటకొచ్చింది.

దాని సారాంశమేంటంటే.. యువ హీరో అభిషేక్‌ బచ్చన్‌తో షారుఖ్ ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగని ఇది మల్టీస్టారర్‌ చిత్రమని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ కొత్త మూవీలో అతడు నటించట్లేదు.. కేవలం నిర్మిస్తున్నాడంతే.

'బాబ్‌ బిస్వాస్‌' పేరుతో అభిషేక్‌తో చేయబోయే ఈ కొత్త చిత్రానికి దియా అన్నపూర్ణా ఘోష్‌ దర్శకులుగా వ్యవహరించనుంది. షారుఖ్‌ సతీమణి గౌరీ ఖాన్, సుజోయ్‌ ఘోష్, గౌరవ్‌ వర్మ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను పంచుకోబోతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్‌పైకి వెళ్లబోతుంది.

ఇవీ చూడండి.. రామ మందిరంపై కంగనా రనౌత్ సినిమా

ABOUT THE AUTHOR

...view details