తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొరియన్​ రీమేక్​లో కింగ్​ఖాన్ షారుఖ్? - షారుక్​ ఖాన్​

ఓ కొరియన్ సినిమా రీమేక్​లో షారుఖ్ ఖాన్ నటించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అందుకు కారణమూ లేకపోలేదు. ఇంతకీ విషయమేంటంటే?

shah rukh khan Recommended Him A South Korean Movie
కొరియన్​ రీమేక్​లో కింగ్​ఖాన్ షారుక్?

By

Published : Feb 6, 2020, 7:18 AM IST

Updated : Feb 29, 2020, 8:56 AM IST

బాలీవుడ్ బాద్​షా షారుఖ్ ఖాన్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. చివరగా 2018లో 'జీరో'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడీ హీరో. ఆ చిత్రం నిరాశపర్చడం వల్ల ప్రాజెక్టుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ఏదీ ఖరారు కాలేదు. అయితే షారుఖ్.. త్వరలో ఓ కొరియన్ హిట్​ రీమేక్​లో నటించబోతున్నాడని టాక్.

కొరియన్ సినిమా 'ఏ హార్డ్ డే' హక్కుల్ని, షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్స్ దక్కించుకుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ రీమేక్​లో ఇతడు నటిస్తాడా? వేరే వారికి అవకాశమిస్తాడా? అనేది చూడాలి.

షారుఖ్.. రాజ్‌ కుమార్‌ హిరానీ, దర్శక ద్వయం రాజ్‌ నిడుమోరు, డీకే కృష్ణలతో సినిమాలు చేయనున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. వీటిపై ధ్రువీకరణ రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: అభిమానులకు షాక్.. వచ్చే సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్'

Last Updated : Feb 29, 2020, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details