కరోనా ఓ మహమ్మారి అని తెలిసినా.. తాకిన వారూ వైరస్ బారినపడే అవకాశమున్నా.. వైద్యులు వారి ప్రాణాలు పణంగా పెట్టి కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అలాంటి వైద్య బృందం రక్షణ కోసం ముందడుగు వేసి, మరోసారి పెద్దమనసును చాటుకున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్. స్వచ్ఛంద సంస్థ 'మీర్' ద్వారా 25 వేల వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ)లను మహారాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా అందించాడు.
షారుక్ ఉదార మనసుకు.. మహారాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి రాజేశ్ తోపె సైతం సలాం అన్నారు.
" 25 వేల పీపీఈలు విరాళంగా ఇచ్చినందుకు షారుక్‌ఖాన్‌కు ధన్యవాదాలు. ఇవి కరోనాతో పోరాడేందుకు ఎంతో సహకరిస్తాయి. వైరస్ నుంచి మన వైద్య బృందాన్ని కాపాడుకునేందుకు దోహదపడతుంది" అని మంత్రి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు బదులిస్తూ ఈ బాలీవుడ్ హీరో స్పందించాడు. ఐక్యమత్యంగా కరోనాతో పోరాడదామని సమాధానమిచ్చాడు.
" కిట్స్ తెప్పించేందుకు మీరు చేసిన సాయానికి ధన్యవాదాలు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ.. మానవత్వాన్ని కాపాడేందుకు మనమంతా కలిసి పనిచేయాలి. ఇందులో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది. మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా."