తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కొత్త సినిమా ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం' - ఖాన్​ అభిమానుల ఆత్మహత్య

బాలీవుడ్​ స్టార్ హీరో షారుక్​ ఖాన్..​ తన అభిమానుల నుంచి ఓ వింత సందేశాన్ని అందుకున్నాడు. ఈ హీరో తెరపై కనిపించి ఏడాది అవుతోంది. ఇప్పటివరకు కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ఈ కారణంగా నిరుత్సాహానికి గురైన అభిమానులు.. తదుపరి చిత్రం ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

shah rukh khan Fan threatens suicide if King Khan doesn't announce his next
'సినిమా ఎప్పుడో ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం'

By

Published : Dec 31, 2019, 2:01 PM IST

బాలీవుడ్ బాద్​షా షారుఖ్​ ఖాన్.. 'జోరో' గతేడాది డిసెంబరులో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫలితంగా తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో జాగ్రత్త పడుతున్నాడీ హీరో. అయితే ఓ అభిమాని మాత్రం షారుక్..​ తన కొత్త చిత్రాన్ని జనవరి 1న ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ట్విట్టర్​లో సందేశం పంపాడు.

'సినిమా ఎప్పుడో ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం'

షారుక్​ ఎప్పడెప్పుడు తీపి కబురు చెబుతాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. 'జోరో' చిత్రం పరాజయం చవిచూడగా, అప్పటి నుంచి బాద్​షా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఫలితంగా ఆభిమానులు "వుయ్ వాంట్​ అనౌన్స్​మెంట్​ ఎస్​ఆర్​కే" అనే హ్యాష్​ట్యాగ్​తో ట్విట్టర్​లో పోస్టులు పెడుతున్నారు.

'సినిమా ఎప్పుడో ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం'

"జనవరి 1న మీరు తర్వాత చిత్రాన్ని ప్రకటించకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా. మరోసారి చెబుతున్నా ఆత్మహత్య చేసుకుంటా"
- ట్విట్టర్​లో ఓ అభిమాని

'సినిమా ఎప్పుడో ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం'

" ఖాన్​ సాబ్​ 'జీరో' వచ్చి ఏడాదవుతోంది. అప్పటి నుంచి మాకు ఎలాంటి ఉత్సాహం లేదు. ఇప్పటికైనా మీరు అభిమానులకు తీపి కబురు చెబుతారని ఆశిస్తున్నా. సినీ పరిశ్రమకే మీరో ప్రత్యేక ఆకర్షణ."
- మరో అభిమాని

'సినిమా ఎప్పుడో ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం'

బాలీవుడ్ బాద్​షా తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఇతడి తర్వాతి సినిమా తమిళ దర్శకుడు అట్లీ, తెలుగు దర్శక ద్వయం రాజ్​-డీకేలలో ఎవరో ఒకరితో ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి అభిమానులకు షారుక్ తీపి కబురు ఎప్పుడు చెప్తాడో వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: వేసవిలో మెగా మేనల్లుడి 'ఉప్పెన'!

ABOUT THE AUTHOR

...view details